శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 02:11:08

జీఓ 59తో ఎస్సీ, ఎస్టీల ఆర్థిక ప్రగతి

జీఓ 59తో ఎస్సీ, ఎస్టీల ఆర్థిక ప్రగతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళితులను ప్రభుత్వ కాంట్రాక్టర్లుగా చూడాలని బీఆర్‌ అంబేద్కర్‌ కన్న కలలను సాకారం చేస్తూ సీఎం కేసీఆర్‌ జీవో 59ను ప్రవేశపెట్టారని, దీని అమలుతో రాష్ట్రంలోని దళిత, గిరిజనులు ఆర్థికప్రగతి సాధించగలుగుతారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సింగరేణిలో జీవో అమలుతీరుపై ఆ సంస్థ అధికారులతో సోమవారం ఆయన  సమీక్షించారు. ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగాల విభాగాల్లోని కాంట్రాక్టు పనుల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%రిజర్వేషన్‌ కల్పించాలని కేసీఆర్‌ సర్కారు ఈ జీవో తెచ్చిందన్నారు. సింగరేణి డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జీవో 59 అమలుపై జాతీయబోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఆ సమావేశంలో ఆమోదం పొందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గతంలో కమిషన్‌ సూచించిన ప్రకారం విదేశీ శిక్షణకు పంపే దళితుల సంఖ్యను 7 నుంచి 11కు పెంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు విద్యాసాగర్‌, రాంబల్‌నాయక్‌, సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరామ్‌, జీఎంలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


logo