ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:18:16

టీవైఈలో హైదరాబాద్‌ బృందానికి రెండో బహుమతి

టీవైఈలో హైదరాబాద్‌ బృందానికి రెండో బహుమతి

  • విద్యార్థుల టీం 1,500 అమెరికన్‌ డాలర్లు కైవసం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ది ఇండస్‌ యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టీవైఈ) గ్లోబల్‌ 2020 స్టార్టప్‌లో నిర్వహించిన పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన పాఠశాల విద్యార్థుల బృందం రెండో బహుమతి గెలుచుకున్నది. ఫైండ్‌ ఆర్‌ బృందానికి చెందిన విద్యార్థులు ద్వితీయస్థానంలో నిలిచి 1,500 అమెరికన్‌ డాలర్లు కైవసం చేసుకున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఫైనల్స్‌లో విజేతలను ఆదివారం రాత్రి ప్రకటించారు. టీవైఈ 11వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో 32 బృందాలు పాల్గొన్నాయి. ఎనిమిది బృందాలు ఫైనల్స్‌కు చేరాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార ఆలోచనలు, వాటి సమస్యలు, పరిష్కారాల ఇతివృత్తాలను స్టార్టప్‌ల రూపంలో ప్రదర్శించిన బృందాలను విజేతలకు ఎంపికచేశారు. హైదరాబాద్‌ బృందంలో యశ్వంత్‌రెడ్డి (ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌), జీ శ్రీలాస్య (ఫిట్‌జీ), సంహిత (ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌), ఇషాన్‌అమిత్‌, మిహార్‌ బొప్పున ఓక్రిడ్జ్‌ స్కూల్‌) ఉన్నారు. వీరిని నిర్వాహకులు, పాఠశాలల        యజమాన్యాలు అభినందించాయి.


logo