శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 16:28:09

ఎస్‌కే జోషి రచించిన ఎకో- టి కాలింగ్‌ పుస్తకావిష్కరణ

ఎస్‌కే జోషి రచించిన ఎకో- టి కాలింగ్‌ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ శైలేంద్ర కుమార్‌ జోషి రచించిన ఎకో-టి కాలింగ్‌ టువర్డ్స్‌ పీపుల్స్‌ సెంట్రిక్‌ గవర్నెన్స్‌ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ... తెలంగాణ పాలన ప్రజల కేంద్రంగా వారి అవసరాల కేంద్రంగా కొనసాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన తన అనుభవంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన ఎస్‌కే జోషి తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావడం ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ పుస్తకంలో పేర్కొనడంపట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన ఎస్‌కే జోషి ప్రస్తుతం ఈ పుస్తకం ద్వారా భవిష్యత్‌ తరాలకు తమ పరిపాలనను పుస్తక రూపంలో అందించారన్నారు. స్వల్ప కాలంలోనే ఇంత మంచి పుస్తకాన్ని తీసుకువచ్చిన జోషికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.


logo