మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 13:33:23

పర్యావరణ హితం..హరితహారం

పర్యావరణ హితం..హరితహారం

నల్లగొండ : ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య..పర్యావరణ సమస్య అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని అన్నెపర్తి శివారులోని మహత్మగాంధీ యూనివర్సిటీ ముందుభాగంలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ..భూమిపై 33శాతం అడవులు ఉండాలన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు శాతం కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ప్రమాదం నుంచి బయట పడడానికి హరితహారం దోహదం చేస్తుందన్నారు. ప్రజా ఉద్యమంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం తీసుకొచ్చారని దీనిని సమిష్టిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైవేలపై పచ్చదనం కూడా సీఎం కృషి వల్లనే సాధ్యమైందన్నారు. ఫారెస్ట్ భూముల ఆక్రమణ సరికాదని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.


logo