సోమవారం 01 జూన్ 2020
Telangana - May 18, 2020 , 02:56:57

పర్యావరణహితంగా ఏకదంతుడు... సీపీసీబీ మార్గదర్శకాలు

పర్యావరణహితంగా ఏకదంతుడు... సీపీసీబీ మార్గదర్శకాలు

హైదరాబాద్  : ఈ ఏడాది వినాయకుడిని సృజనాత్మకంగా తయారుచేసుకోవాలి. గడ్డి, వెదురు, చెరుకు గడలను వినియోగించి  బంక మట్టిని పూసి విగ్రహాలుగా మలుచుకోవాలి. విగ్రహాల లోపల మొక్కజొన్నపిండి, పాలకూర, గోధుమపిండి, వెజిటెబుల్‌ పౌడర్‌లను వాడాలి. పూలు, చెట్ల ఆకులు, బెరడుల నుంచి తయారు చేసిన సహజ రంగులను వినియోగించాలని  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలు జారీచేసింది. ఇక ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, ప్లాస్టిక్‌, థర్మోకోల్‌తో తయారుచేసిన విగ్రహాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించిన బోర్డు, రసాయన రంగుల వాడకంపైనా ఆంక్షలు విధించింది. మొత్తం మీద పర్యావరణహితంగా నవరాత్రులను జరుపుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.

సీపీసీబీ మార్గదర్శకాలు

  • విగ్రహాల తయారీకి సహజ, బయోడిగ్రేడబు ల్‌, ఎకో ఫ్రెండ్లీ ముడిపదార్థాలను మాత్రమే    వాడాలి. బంకమట్టి, గడ్డి, వెదురు, చెరుకుగడలను మాత్రమే వినియోగించాలి. 
  •  ఎండబెట్టిన పూల నుంచి తయారుచేసిన రం గులను మాత్రమే విగ్రహాలకు వేయాలి.  పూలు, చెట్ల బెరడు, పుప్పొడి, ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లతో తయారు చేసిన రంగులనే వినియోగించాలి. 
  •  రసాయనాలతో తయారు చేసిన రంగులు,  పేయింట్లను వాడటం పూర్తిగా నిషిద్ధం.
  •  అలంకరణ కోసం వాడే బట్ట సైతం సహజ పదార్థాలతో తయారు చేసినదై ఉండాలి. 
  •  తక్కువ ఎత్తుగల విగ్రహాలను ఎంచుకోవడం ఉత్తమం. 
  •  మట్టి విగ్రహాలు కావడంతో లోపల మొక్కజొన్న, పాలకూర,   గోధుమపిండి, వెజిటెబు ల్‌ పౌడర్‌లను ఉపయోగించాలి
  •  పూజ, ముగ్గులు, అలంకరణ కోసం ఆర్గానిక్‌ రంగులైన పసుపు, చందనం, జాజులను వాడాలి.
  •  మండపాల్లో ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లకు బదులుగా విస్తరాకులు, అరటిఆకులు, మట్టి, పేపర్‌ గ్లాసులు కప్పులను మాత్రమే వాడాలి.


logo