మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 07:50:17

హైదరాబాద్‌లో భూకంపం

హైదరాబాద్‌లో భూకంపం

హైదరాబాద్‌ : నగరంలోని వస్థలీపురం బీఎన్‌రెడ్డి నగర్‌, వైదేహినగర్‌లో గురువారం వేకువ జామున భూ ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారు జామున 5.40 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. శబ్దాలు రావడంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. మూడుసార్లు స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 5.40 గంటలకు ఒకసారి, 6.45గంటలకు మరోసారి వైదేహీనగర్‌లో పెద్దశబ్దంతో భూమి కంపించింది. 7.08గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి.

మరుసగా మూడుసార్లు భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ వారం రోజుల కిందట గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వచ్చాయని భయం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.