ధర్మపురిలో వైభవంగా పంచసహస్ర దీపాలంకరణ

ధర్మపురి : ఆకాశాన మిలమిలలాడే చుక్కలన్నీ ఈ కోనేట్లో మణిదీపాలుగా వెలుగొందాయా అన్నట్లుగా మెట్టుమెట్టుకు ఓ దీపం..అజ్ఙాన తిమిరాలు, కష్టాల చీకట్లను తరిమికొడుతూ అడుగుఅడుగుకూ ఓదీపం.. ఒక్కో దీపం అలా జ్వాలా తోరణమై పంచసహస్ర దీపాలంకరణగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నారసింహక్షేత్రాలలో ఒక్కటైన ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి(కోనేరు) సోమవారం ఇలా ఆధ్యాత్మిక కాంతులను విరజిమ్మంది. కోనేరులో పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆలయ వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ తదితర వేదబ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ ఉప ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాసాచారి బ్రహ్మపుష్కరిణి మధ్య గల బోగమండపంలో లక్ష్మీనరసింహస్వామివారి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత, కలెక్టర్ రవి, అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఈవో శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలు బ్రహ్మపుష్కరిణి చుట్టూ దీపాలను వెలిగించారు. దీపకాంతులతో పుష్కరిణి శోభిల్లింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో ఆర్థిక కష్టాలకు చెక్: బీ అలర్ట్.. కరోనా ఎఫెక్ట్
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి