బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 16:36:20

తెలంగాణ వందశాతం గుడుంబా రహిత రాష్ట్రం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

తెలంగాణ వందశాతం గుడుంబా రహిత రాష్ట్రం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : అక్రమాలను నిర్మూలించడంతో మద్యంపై వచ్చే ఆదాయం పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మంత్రులు శాసనసభలో వ్యవసాయం, పశుసంవర్థక, సహకార, పౌరసరఫరాలు, రెవెన్యూ, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌, హోం, రవాణాశాఖ పద్దులను ప్రవేశపెట్టారు. పద్దులపై చర్చలో భాగంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గత పాలకులు గీత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. గీతకార్మికులకు అండగా ఉన్నానంటూ సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారన్నారు. తెలంగాణ వందశాతం గుడుంబా రహిత రాష్ట్రంగా మారిందన్నారు. నాటుసారా తయారీపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలపై గిరిజనులు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ ఏడాదిలోనే ట్యాంక్‌బండ్‌పై నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల పెరుగుదల చాలా స్వల్పంగా ఉందన్నారు. మద్యనిషేధం కావాలంటే ప్రజల్లో అవగాహన రావాలని మంత్రి పేర్కొన్నారు.


logo