గురువారం 28 మే 2020
Telangana - May 09, 2020 , 21:24:03

ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పన్ను చెల్లింపు దారులకు పురపాలకశాఖ తీపికబురు అందించింది. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఆస్తిపన్నుపై 5 శాతం ఎర్లీడర్డ్‌ ప్రోత్సాహకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఆస్తి పన్ను ఎంత ఉన్నా మే 31 లోగా చెల్లిస్తే ఈ 5 శాతం వర్తిస్తుందని పేర్కొంది. రెసిడెన్షియల్‌, కమరిషయల్‌ విభాగాల వారీగా ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకం వర్తించనునన్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వార్షిక ఆదాయపు పన్ను పరిమితి రూ.30 వేలు ఉంటేనే ఎర్లీబర్డ్‌ ప్రోత్సాహకం వర్తిస్తుందని గతంలో ప్రకటింటిన పరిమితిని తాజాగా ఎత్తివేసింది.


logo