బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 12:19:04

గ్రేటర్‌లో తొలిఫలితం వెల్లడి

గ్రేటర్‌లో తొలిఫలితం వెల్లడి

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నం డివిజన్‌ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ గెలుపొందారు. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్‌లో అత్యల్పంగా మెహిదీపట్నంలోనే తక్కువగా ఓట్లు పోలయ్యాయి. 70వ డివిజన్‌లో అత్యల్పంగా 11,818 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో తొలిరౌండ్‌లోనే ఫలితం వెలుడింది. మాజిద్‌ హుస్సేన్‌ గతంలో ఆయన జీహెచ్‌ఎంసీ మేయర్‌గా పని చేశారు. డివిజన్‌లో 11,883 ఓట్లు పోలు కాగా.. ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌కు 7,418 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి 1935 ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా.. 44 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది. 


logo