సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 06:53:51

రోజుకు 15 వేలమందికి ఎంసెట్‌ : తుమ్మల పాపిరెడ్డి

రోజుకు 15 వేలమందికి ఎంసెట్‌ : తుమ్మల పాపిరెడ్డి

హైదరాబాద్‌ : ఆగస్టులోనే ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి యోచిస్తున్నది. గతంలో రోజుకూ 50 వేల మందితో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహించేవారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా రోజుకు 15 వేల మందితో ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి కన్వీనర్లకు పంపించారు. సీబీటీ కేంద్రాలను కూడా పెంచాలని చూస్తున్నారు. పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ కేంద్రాన్ని శానిటైజ్‌ చేయనున్నారు.

ఉదయం తొమ్మిది గంటల నుంచే సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. తిరిగి మూడు గంటల విరామంతో శానిటైజ్‌చేసి, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీబీటీ సర్వీస్‌ ప్రొవైడర్‌ టీసీఎస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆగస్టులోనే ఎంసెట్‌ నిర్వహించేలా నిర్ణయించిన తేదీలను హైకోర్టుకు సమర్పిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.


logo