బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 07:15:11

ఎంసెట్ తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభం‌

ఎంసెట్ తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభం‌

హైద‌రాబాద్‌: ఎంసెట్ తుదివిడు‌త కౌన్సెలింగ్ నేటినుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్ర‌కారం నిన్న‌నే మొద‌ల‌వ్వాల్సి ఉండాగా వెయిటేజీ విష‌యంలో హైకోర్టు స్టే విధించింది. దీంతో న్యాయ‌స్థానం ఆదేశాల  నేపథ్యంలో తుది విడుత కౌన్సెలింగ్‌ను శుక్రవారం నుంచి ప్రారంభించ‌నుంది. ఇందులో భాగంగా నేటి నుంచి వ‌చ్చేనెల 2 వ‌ర‌కు కాలేజీల్లో సీట్ల కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తారు. ఈ నెల 31న ఇంటర్‌లో పాసైన అర్హులు స్లాట్‌ బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి సర్టిఫికెట్లను నవంబర్‌ 1 నుంచి పరిశీలించ‌నున్నారు. వ‌చ్చేనెల‌ 4న ఎంసెట్‌ తుది విడుత సీట్లను కేటాయిస్తారు. అదేనెల 7వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.