ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 08:43:56

మ‌రికొద్దిసేప‌ట్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష

మ‌రికొద్దిసేప‌ట్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష

హైద‌రాబాద్‌: రాష్ట్రంలోని అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించే ఎంసెట్ అగ్రికల్చ‌ర్ ప‌రీక్ష‌లు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. నేడు, రేపు రెండు విడత‌లుగా ప‌రీక్ష‌ల‌ను ఆన్‌లైన్‌లో నిర్వ‌హించనున్నారు. ఈ ప‌రీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష కోసం రాష్ట్రంలో 67, ఏపీలో 17 మొత్తం 84 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 

ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వారా బీటెక్ అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ప్ర‌వేశ ప‌రీక్ష‌లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. క‌రోనా నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష‌లు ప‌లుమార్లు వాయిదాప‌డ్డాయి. అయితే కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా ఆంక్ష‌ల‌ను క్ర‌మంగా స‌డ‌లిస్తుండ‌టంతో జాతీయ స్థాయి, రాష్ట్ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను ఒక్కొక్క‌టిగా నిర్వ‌హిస్తున్నారు.  


logo