బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 10, 2020 , 17:44:51

ప్రజలకు వీ మార్ట్‌ ఉచిత డెలివరీ సేవలు.. ఇహార్‌ యాప్‌ ప్రారంభం

ప్రజలకు వీ మార్ట్‌ ఉచిత డెలివరీ సేవలు.. ఇహార్‌ యాప్‌ ప్రారంభం

సిద్దిపేట :  సామాజిక సేవల, మానవతా దృక్పథంతో తమ వంతు సాయంగా వీమార్ట్‌.. సిద్దిపేట ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సిద్దిపేట ప్రజలకు వీ మార్ట్ మరింత చేరువయ్యేలా ఫ్రీ డోర్ డెలివరీ లభించేలా యాప్ రూపొందించింది. 

ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం వీ మార్ట్ స్టోర్స్ ఇహారా ఫుడ్ డెలివరీ సర్వీసు యాప్ ప్రారంభించారు. లాక్ డౌన్ దృష్ట్యా ఇక నుంచి సిద్ధిపేట ప్రజలకు వీ మార్ట్ మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు ఈ పరిస్థితుల్లో ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ యాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ లో ఇహారా యాప్ డౌన్ లోడ్ చేసుకుని వీ మార్ట్ డెలివరీ సిస్టంలోకి వెళ్లి మీకు కావలసిన నిత్యావసర సరుకులను ఆర్డర్ చేసుకోవచ్చని ప్రజలకు చెప్పారు. ఈ మేరకు వీ మార్ట్ ఉద్యోగస్తులకు మంత్రి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హాస్యనటుడు శివారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 వీ మార్ట్ ఇహారా యాప్ డౌన్ లోడ్ కు ఈ లింక్ ను క్లిక్ చేయండి. 

 https://play.google.com/store/apps/details?id=com.adeal.eaharaservices&hl=en    

పోలీసులకు వెయ్యి శానిటైజర్ల పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అను నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజా శ్రేయస్సుకై అహర్నిశలు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను మంత్రి అభినందించారు. వీ మార్ట్ సౌజన్యంతో జిల్లాలోని పోలీసులకు వెయ్యి శానిటైజర్లను శుక్రవారం మధ్యాహ్నం పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ తో కలిసి మంత్రి చేతుల మీదుగా పోలీసులకు శానిటైజర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామేశ్వర్, రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
logo