శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:02:12

పూర్వవిద్యార్థుల సేవలు పొందాలి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

పూర్వవిద్యార్థుల సేవలు పొందాలి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు పూర్వవిద్యార్థుల సేవలు పొందాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సూచించారు. రాష్ట్రంలోని పూర్వ విద్యార్థుల నెట్‌వర్కింగ్‌పై నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) బృందం బుధవారం రాజ్‌భవన్‌లో చేసిన ప్రదర్శనలో గవర్నర్‌ మాట్లాడారు. పూర్వ విద్యార్థులు అందించే విరాళాలు, ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం, ఈవెంట్లకు సహాయం వంటి సేవలు అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎన్‌ఐసీ డిప్యూటీ డైరెక్టర్‌ రాజశేఖర్‌ బృందం రాష్ట్రంలోని పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ గురించి గవర్నర్‌కు వివరించారు.  

ఈ-ఆఫీస్‌తో పారదర్శకత: గవర్నర్‌

ఈ ఆఫీస్‌ ద్వారా పౌరసేవల్లో వేగం, పారదర్శకత పెరుగుతాయని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో ఐటీ, ఈసీ విభాగం జాయింట్‌ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్‌, అధికారులు ఈ-ఆఫీస్‌ విధానంపై గవర్నర్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధ్యమైనంత ఎక్కువ స్థాయిల్లో ఈ-ఆఫీస్‌ సేవలను అందించాలని సూచించారు. ఈ- ఆఫీస్‌, ఈ-గవర్నెన్స్‌తో ప్రజలు తమకు కావాల్సిన చట్టబద్ధమైన సేవలు సులభంగా, హక్కుగా పొందుతారని చెప్పారు.  


logo