శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 06:59:17

ఏప్రిల్‌ నుంచి అమల్లోకి ఈ-ఇన్‌వాయిస్‌

ఏప్రిల్‌ నుంచి అమల్లోకి ఈ-ఇన్‌వాయిస్‌

హైదరాబాద్ : జీఎస్టీ పన్ను చెల్లింపుదారులకు 2020 ఏప్రిల్‌ నుంచి ఈ-ఇన్‌వాయిస్‌ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు హైదరాబాద్‌ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌ వాసా శేషగిరిరావు తెలిపారు. మంగళవారం బాలానగర్‌ పారిశ్రామికవాడలోని జాతీయ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌ (నైఫర్‌)లో ‘జిల్లాల్లో సెంట్రల్‌ జీఎస్టీ మీ వద్దకు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే బేగంపేట్‌లోని హోటల్‌ హరిత ప్లాజాలో బల్క్‌ డ్రగ్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో జీఎస్‌టీపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా జీఎస్టీ విభాగం ఉన్నతాధికారులతో ఇంటరాక్టిన్‌ సెషన్‌ జరిగింది. ఈ సదస్సులో జీఎస్టీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ డి.పురుషోత్తమ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పన్ను చెల్లింపుదారులు, జీఎస్టీ వృత్తి నిపుణులు హాజరై జీఎస్టీపై పలు సందేశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ జీఎస్టీ ఫైలింగ్‌లో నెలకొన్న సమస్యల నివృత్తికి అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2020 నుంచి ఈ-ఇన్‌వాయిస్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. అనంతరం జీఎస్టీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ డి.పురుషోత్తమ్‌ మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకున్న నేపధ్యంలో వ్యాపారులు జీఎస్టీ విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సీనియర్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.అగర్వాల్‌, కార్యదర్శి శ్రీనివాస్‌ రాజులతో పాటు దాదాపు 50 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెజ్‌కు సంబంధించిన కస్టమ్స్‌ యాక్ట్‌, వాటి విధి విధానాలు, ఐటీసీ, రీఫండ్స్‌, ఎక్స్‌పోర్ట్స్‌ వంటి అంశాల్లో అసోసియేషన్‌ ప్రతినిధులు తమ అనుమానాలను అధికారుల వద్ద నివృత్తి చేసుకున్నారు.కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా జీఎస్టీ కమిషనర్‌ ఎన్‌.శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ ఎం.మురళీకృష్ణ,డిప్యూటీ కమిషనర్లు పుండరిక ప్రసాద్‌, కె.సురేందర్‌ఫాల్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.బాలాజీ, 300మంది పన్ను చెల్లింపుదారులు, వృత్తి నిపుణులు,డాక్టర్‌ రెడ్డీస్‌, డివీస్‌, అరబిందో ల్యాబ్స్‌ వంటి పెద్ద సంస్థల ప్రతినిధులు  పాల్గొన్నారు. logo