మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 14, 2020 , 21:35:05

ఈ నెల 16 నుంచి ఈ-గ్రీవెన్స్‌లు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

ఈ నెల 16 నుంచి ఈ-గ్రీవెన్స్‌లు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌: నగరంలో ఈ నెల 16 నుంచి ఈ-గ్రీవెన్స్‌లు(ప్రజావాణి కార్యక్రమం) ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 29 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సర్కిల్‌ కార్యాలయాల్లో ఈ గ్రీవెన్స్‌లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ విధింపుపై పున: పరిశీలన పిటిషన్లు, లీగల్‌, కోర్టు కేసులు ఇతర ట్యాక్స్‌ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఈ గ్రీవెన్స్‌లు తోడ్పడతాయని కమిషనర్‌ తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ విషయంలో ఇబ్బందులు, కేసులు ఉన్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలియజేశారు. 


logo