శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 26, 2020 , 20:41:48

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దసరా..

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దసరా..

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆదివారం దసరాను ఘనంగా జరుపుకున్నారు. జమ్మిచెట్టుకు పూజలు..రాంలీలాతో గ్రామాలు.. పట్టణాల్లో పండుగ వాతావరణం కనిపించింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో క్రాకర్, లేజర్ షో అలరించింది. వేలాది మంది ప్రజలు తరలివచ్చి వీక్షించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది.  అలాగే, వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ఉర్సు గుట్టరంగాలీల మైదానంలో నిర్వహించిన రాంలీలా ప్రజలను అలరించింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.