మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 19:56:32

పాడి రైతులకు దసరా కానుకగా బోనస్‌

పాడి రైతులకు దసరా కానుకగా బోనస్‌

ఆదిలాబాద్‌ రూరల్ ‌: తెలంగాణలోని పాడిరైతులందరికీ దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర డెయిరీ సంఘం నుంచి బోనస్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని లక్షా 17వేల మంది పాడి రైతులకు బోనస్‌ దసరా పండుగలోపు అందిస్తామన్నారు. 

పాడి రైతులు దసరా పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డెయిరీలో పాలు పోసే పాడి రైతులకు సబ్సిడీపై బర్రెలను కూడా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డెయిరీలో పాలు పోసేవారికి ప్రతి నెలా 15, 30 తేదీల్లో డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్‌ రెడ్డి, నాయకుడు గోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo