గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 14:56:04

ప్రారంభానికి ముందే ప‌ర్యాట‌క సంద‌డి

ప్రారంభానికి ముందే ప‌ర్యాట‌క సంద‌డి

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప‌్రారంభానికి ముందే ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిటలాడుతున్న‌ది. ప్ర‌తిరోజు వేలాది‌మంది వచ్చి బ్రిడ్జిపైనుంచి ప‌ట్ట‌ణం అందాలు చూస్తూ మైర‌మ‌ర‌చిపోతున్నారు. రూ.184 కోట్ల వ్య‌‌యంతో నిర్మించిన ఈ బ్రిడ్డి దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్డిగా నిలువ‌నుంది. నిర్మాణ ప‌నుల‌న్నీ ఇప్ప‌టికే పూర్త‌య్య‌యాయి. వ‌చ్చేవారం సీఎం కేసీఆర్ చేతుల‌మీదుగా ఇది ప్రారంభం కానుంది. 754.38 మీట‌ర్ల పొడ‌వున్న ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావ‌డంతో మాదాపూర్‌, జూబ్లీహిల్స్ మ‌ధ్య దూరం త‌గ్గ‌నుంది. వారాంతాల్లో జ‌నాల‌తో కిక్కిరిసిపోయిన ఈ తీగ‌ల వంతెన ఫొటోల‌ను తెలంగాణ ప్ర‌భుత్వ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు.   గోల్కొండ న‌వాబుల‌కు తాగు నీరందించిన దుర్గం చెరువు, భారతదేశంలోని రహస్యతటాకాల్లో ఒకటిగా చ‌రిత్ర‌లో నిలిచింది. అయితే స్వాతంత్య్రానంత‌రం ఆంధ్రపాలకుల నిర్లక్ష్యంతో చెరువు అందాలు అంతరిపోగా, ప‌రిస‌రాలు దుర్గంద‌భ‌రితంగా త‌యార‌య్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువుపై ప్రత్యేక దృష్టిసారించింది. పునరుద్దరణ పనులు చేపట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్న‌ది. 


logo