మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 15:01:40

డంప్‌, గ్రేవ్‌ యార్డులు వినియోగంలోకి తేవాలి : మంత్రి హరీశ్‌రావు

డంప్‌, గ్రేవ్‌ యార్డులు వినియోగంలోకి తేవాలి :  మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో డంప్‌ యార్డులు, గ్రేవ్‌ యార్డుల నిర్మాణాలు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామరెడ్డితో కలిసి దుబ్బాక పరిధిలోని పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట మండలంలోని అన్నీ గ్రామాల్లో గ్రేవ్ యార్డులు నిర్మాణం, డంప్ యార్డుల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. సత్వరమే వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. చేగుంటలో డంప్‌యార్డు నిర్మాణాలు పూర్తి ఎర్రలు వేసి కంపోస్ట్‌ తయారీకి సిద్ధం చేసిన ఎంపీడీఓను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. అలాగే నియోజకవర్గంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లో వోల్టేజీ లేకుండా చూడాలని, అవసరమైతే కొత్తగా, అదనపు టాన్స్‌ఫార్మర్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఇస్తే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పనులు ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేగవంతం చేసేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo