బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 13:40:27

సీఎం సహాయనిధికి డ్యూక్‌ బిస్కెట్‌ కంపెనీ 25 లక్షలు విరాళం

సీఎం సహాయనిధికి డ్యూక్‌ బిస్కెట్‌ కంపెనీ 25 లక్షలు విరాళం

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రముఖులందరూ ముందుకు వస్తున్నారు. సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇవాళ ఉదయం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ను డ్యూక్‌ బిస్కెట్‌ కంపెనీ మేనేజింగ్‌ భాగస్వాములు రమేశ్‌ అగర్వాల్‌, రాజేందర్‌ అగర్వాల్‌ కలిసి సీఎం సహాయనిధికి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చాయి. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కేటీఆర్‌కు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. 


logo