గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 21:30:47

దుగ్యాల మృతి బాధాకరం : మంత్రులు

దుగ్యాల మృతి బాధాకరం : మంత్రులు

హైదరాబాద్‌ : పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌రావు మృతి పట్ల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దుగ్యాల నాకు సన్నిహితుడు. ఇద్దరం ఒకే నియోజకవర్గానికి చెందిన వాళ్లమని తెలిపారు. ఎమ్మెల్యేగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిలో శ్రీనివాస్‌రావు ముఖ్య పాత్ర పోషించారు. వారి మరణం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ దుగ్యాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు..

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం

మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయండి 

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు 

క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి 

తాజావార్తలు


logo