మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 11:41:39

బెడిసి కొడుతున్న ‘కమలం’ ఫోన్‌ కాల్స్‌ ప్రచారం

బెడిసి కొడుతున్న ‘కమలం’ ఫోన్‌ కాల్స్‌ ప్రచారం

  • దుబ్బాక నియోజకవర్గంలో బోల్తా కొడుతున్న ‘బీజేపీ’ పిట్ట
  • ‘బోరు మోటారుకు.. మీటరు పెట్టే.. బీజేపీకి ఓటేయ్యాలా’.. అంటూ మండిపాటు
  • కాషాయ అభ్యర్థి రఘునందన్‌రావు కార్యాలయ ఫోన్లపై ఓటర్ల ఆగ్రహం

దుబ్బాక : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న రఘునందన్‌రావు ప్రచారంలో భాగంగా సిబ్బందితో చేయిస్తున్న ఫోన్లకు ఓటర్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘వ్యవసాయ బోరు మోటార్లకు మీటర్లు పెట్టే.. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు’.. అని ఓటర్లు కాలర్స్‌కు తెగేసి చెబుతున్నారు. ఓటర్ల మాటల తూటాలతో ఫోన్‌ కాలర్స్‌ ఖంగుతింటున్నారు. 

ఆయ‌న‌ గెలిస్తే ఇంట్లో పండుకుంటాడు. ఆయన ఇంతవరకు ఒక్కసారి మా ఊరు రాలేదమ్మ.. గాయనకు ఓటేస్తే మళ్లా కనిపిస్తాడా మేడం?  ఆయన ఎవరో ముఖమే తెలువకపాయే.. ఎట్లా ఎయ్యామంటావు ఓటు..  ఆయన గెలువడు. ఇంతకు ముందు ఒకసారి ఓటేస్తే, ఓడిపాయె..! ఓడిపోయె నాయకుడికి మళ్లా ఎట్లా ఓటెయ్యాలి? అని ఓ ఓట‌రు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.

ప‌ది రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంపై సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పించ‌డం గమనార్హం. ఇటీవల బీజేపీ రఘునందన్‌రావు కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు ఓ ఓటరు కురిపించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ ఫోన్‌ సంభాషణ కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. logo