మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 02:49:26

దీవించండి.. అభివృద్ధి చేస్తా

దీవించండి.. అభివృద్ధి చేస్తా

  • దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత 

దుబ్బాక టౌన్‌: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత సోమవారం దుబ్బాక మండల కేంద్రం లో ప్రచారం చేశారు. ఈ ఉపఎన్నికలో తనను ఆదరించాలని అభ్యర్థించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలాగే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సోలిపేట సుజాత హామీ ఇచ్చారు.