సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 12:53:12

క‌లం వీరుడు రామ‌లింగారెడ్డి: మ‌ంత్రి కేటీఆర్‌

క‌లం వీరుడు రామ‌లింగారెడ్డి: మ‌ంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో రామ‌లింగారెడ్డి లాంటి నాయకులు అరుద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. క‌లం వీరుడిగా ఉద్య‌మానికి మ‌ద్ద‌తునిచ్చిన వ్య‌క్తి రామ‌లింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగ‌త ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.   

రామ‌లింగారెడ్డిది గొప్ప వ్య‌క్తిత్వ‌మ‌ని, నిరాడంబ‌ర‌మైన జీవ‌న విధానంతో ఉండేవార‌ని చెప్పారు. అంద‌రితో క‌లుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల సంద‌ర్భంగా దొమ్మాట నియోజ‌క‌వ‌ర్గానికి రామ‌లింగారెడ్డి అయితేనే న్యాయం చేస్తార‌ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావించార‌ని, ఆ టికెట్‌ కోసం ఎంతోమంది ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ కేసీఆర్ ప‌ట్టుబ‌ట్టి రామ‌లింగారెడ్డికే టికెట్ ఇచ్చారని వెల్ల‌డించారు.


logo