శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 12:29:01

దుబ్బాక‌.. 8వ రౌండ్ వ‌ర‌కు ఫ‌లితాలు

దుబ్బాక‌.. 8వ రౌండ్ వ‌ర‌కు ఫ‌లితాలు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఫ‌లితాల్లో మొద‌టి ఐదు రౌండ్ల‌లో ఆధిక్యం క‌న‌బ‌రిచిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆ త‌ర్వాతి రౌండ్ల‌లో వెనుకంజ‌లో ఉంది. 6, 7 రౌండ్ల‌లో వెనుకంజ‌లో ఉన్న బీజేపీ మ‌ళ్లీ 8 రౌండ్‌లో పుంజుకుంది. ఆరు, ఏడు రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం క‌న‌బ‌రిచింది. టీఆర్ఎస్ పార్టీ ఆరో రౌండ్‌లో 353 ఓట్ల ఆధిక్యం సాధిచంగా, ఏడో రౌండ్‌లో 182 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఎనిమిది రౌండ్‌లో బీజేపీ 621 ఓట్ల మెజార్టీ సాధించింది. ఇక పోస్ట‌ల్ బ్యాలెట్ల‌లోనూ టీఆర్ఎస్ పార్టీ 516 ఓట్లు సాధించి ముందంజ‌లో ఉంది. 

ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీ 2495 ఓట్లు సాధించ‌గా, బీజేపీ 3116, కాంగ్రెస్ 1122 ఓట్లు సాధించింది. ఎనిమిది రౌండ్లు పూర్త‌య్యే స‌రికి టీఆర్ఎస్ పార్టీకి 22772 ఓట్లు, బీజేపీకి 25878 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 5125 ఓట్లు పోల‌య్యాయి.