సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 11:57:24

కొనసాగుతున్న దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌..

కొనసాగుతున్న దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌..

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యింది. తొలిరౌండ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందర్‌ రావు స్వల్ప మెజారిటీలో కొనసాగుతున్నారు. మొత్తం 23 రౌండ్లు ఉండగా ఇప్పటివరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఐదో రౌండ్ వరకు బీజేపీ అభ్యర్థి 16,517 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 13,497 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి 2,724 ఓట్లు సాధించారు.

ఇంకా 18 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. విజయం ఎవరినైనా వరించే అవకాశముంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితం రావచ్చు. ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత‌, కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి‌, బీజేపీ నుంచి రఘునందర్‌రావుతోపాటు చిన్నాచితక పార్టీల నుంచి  23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.