శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 07:08:56

నేటితో దుబ్బాక ఎన్నిక‌ల‌ ప్రచారాని తెర‌

నేటితో దుబ్బాక ఎన్నిక‌ల‌ ప్రచారాని తెర‌

హైద‌రాబాద్‌: దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చార‌ప‌ర్వం చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ది. ఇవాళ‌ సాయంత్రం 5 గంట‌ల‌కు పార్టీల ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. ఈనెల 3న ఉపఎన్నిక పోలింగ్ జ‌రుగ‌నుంది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మృతితో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. దీంతో అన్ని పార్టీలు గెలుపే ల‌క్ష్యంగా రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున దివంగ‌త రామ‌లింగారెడ్డి స‌తీమ‌ణి సుజాత పోటీలో ఉన్నారు. ఆమె గెలుపు బాధ్య‌త‌ను మంత్రి హ‌రీశ్‌రావు త‌న భుజాన‌వేసుకున్నారు. 

ఈనెల 3న పోలీంగ్ ఉండ‌టంతో ఏర్పాట్ల‌పై అధియార యంత్రాంగం నిమ‌గ్న‌మ‌య్యింది. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు త‌లెత్త‌కుండా పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట‌ జిల్లాలో నెల‌రోజుల‌పాటు పోలీస్ యాక్ట్‌-1861ను అమ‌లు చేయ‌నున్నారు. ప్ర‌చారం ముగియ‌గానే స్థానికేత‌రులు వెన‌క్కి వెళ్లిపోవాల‌ని ఆదేశాలు జారీచేశారు.