శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 01:26:20

‘పవర్‌' ఫుల్‌దుబ్బాక

‘పవర్‌' ఫుల్‌దుబ్బాక

  • ఆరేండ్లలో రూ.104.09 కోట్ల విద్యుత్‌ పనులు
  • కొత్తగా 18 విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు
  • నాణ్యమైన విద్యుత్‌తో ఆనందంలో రైతులు 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో విద్యుత్‌ జిగేల్‌మంటున్నది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయించారు. ఈ ఆరేండ్లలో సుమారు రూ.104.09 కోట్ల విద్యుత్‌ పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని అప్పనపల్లి, రామసముద్రం, రామక్కపేట, తిమ్మాపూర్‌, బొప్పాపూర్‌, కాసులాబాద్‌, జప్తిలింగారెడ్డిపల్లి, గొడుగుపల్లి, మాచిన్‌పల్లి, అనాజీపూర్‌, కాసన్‌పల్లి, అనంతసాగర్‌ గ్రామాల్లో  33/11 కేవీ సబ్‌స్టేషన్లను 14 కొత్త వినియోగంలోకి తీసుకురాగా, ధర్మారం, పెద్దమాసాన్‌పల్లి, చిత్తోజ్‌పల్లి, పోతారం గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. కాగా దౌల్తాబాద్‌లో 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను రూ. 8.70 కోట్లతో ఏర్పాటుచేశారు. లోవోల్జేజీ నివారణకు 23 అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, 16 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు.  గత ప్రభుత్వాల హయాంలో దొంగ కరెంట్‌తో అనేక ఇబ్బందులు పడేవాళ్లమని పలువురు రైతులు తెలిపారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ దయతో కరెంట్‌ బాధలు తప్పాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.