శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 18:24:15

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి తెర

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి తెర

సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. చివరిరోజు కావడం.. 6 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గవ్యాప్తంగా హోరోహోరీగా ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌ రావు పోటీపడుతున్నారు. ఈ నెల 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

నియోజకవర్గంలో లక్షా 98 వేల 756 మంది ఓటర్లున్నారు. అధికారులు 315 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 89 కేంద్రాలను సమస్యాత్మకంగా పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్‌ నుంచి రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత పోటీలో ఉన్నారు. ఉప ఎన్నికకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3న ఉప పోలింగ్‌ జరుగనుండగా 10న ఓట్ల లెక్కింపు నిర్వహించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.