సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:35:44

వైద్యఖర్చు రూ.కోటి మాఫీ

వైద్యఖర్చు రూ.కోటి మాఫీ

  • తెలంగాణవాసి పట్ల దుబాయ్‌ కంపెనీ ఔదార్యం
  • ఆపరేషన్‌ చేయించి, ప్రత్యేక విమానంలో స్వగ్రామానికి పంపించిన యాజమాన్యం

 రామడుగు: బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతుంటే అక్క డి కంపెనీ అండగా నిలిచింది. కోటి రూపాయలు వెచ్చించి ఆపరేషన్‌ చేయించి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపించింది. రాజన్న సిరిసిల్ల జి ల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన బత్తిని మల్లయ్య 13 ఏండ్ల క్రితం దుబాయ్‌లోని ప్రొస్కేప్‌ కంపెనీలో చేరాడు. రెండు నెలల క్రితం పనిచేస్తున్న చోట స్పృహతప్పి పడిపోయాడు. తోటి కార్మికులు దవాఖానకు తీసుకెళ్లగా మల్లయ్యకు బ్రెయిన్‌ ట్యూ మర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కంపెనీ యాజమాన్యం చొరవ తీసుకుని ఆపరేషన్‌ చేయించింది. తన భర్తను ఎలాగైనా స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లుచేయాలని దుబాయ్‌లోని ఎల్లాల శ్రీనన్న సేవాసమితి కోఆర్డినేటర్‌, జగిత్యాల జిల్లాకు చెందిన ఆరెల్లి రమేశ్‌, మీడియా కోఆర్డినేటర్‌ రమేశ్‌ను మల్లయ్య భార్య సమ్మవ్వ వేడుకున్న ది. వారు విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా.. యాజమాన్యం అంగీకరించిప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేసింది. శనివారం మధ్యాహ్నం  దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానంలో మల్లయ్య హైదరాబాద్‌ చేరుకొన్నారు. రెండు నెలలుగా మల్లయ్య దవాఖాన ఖర్చులు సుమారు రూ.62 లక్షలు, విమానంలో తరలించినందుకు రూ.40 లక్షలు కాగా మొత్తం రూ.1.02 కోట్లను దుబాయ్‌లోని ప్రొస్కేప్‌ కంపెనీ భరించినట్లు సేవాసమితి సభ్యులు తెలిపారు.  


logo