మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 16:06:39

దుబాయ్‌లో తెలంగాణ కోవిడ్ రోగికి 1.52 కోట్ల బిల్లు మాఫీ

దుబాయ్‌లో తెలంగాణ కోవిడ్ రోగికి 1.52 కోట్ల బిల్లు మాఫీ

హైద‌రాబాద్‌: యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన దుబాయ్ హాస్పిట‌ల్  ఔదార్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.  తెలంగాణ‌కు చెందిన కోవిడ్ రోగి బిల్లును మాఫీ చేసింది. 42 ఏళ్ల‌ ఓడ్నాలా రాజేశ్ అనే వ్య‌క్తి దుబాయ్ హాస్పిట‌ల్‌లో 80 రోజులు కోవిడ్ చికిత్స తీసుకున్నాడు.  తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాకు చెందిన అత‌ని చికిత్స కోసం 1.52 కోట్లు ఖ‌ర్చు అయ్యింది.  కోవిడ్19 చికిత్స పొందిన రాజేశ్‌ది ఆ బిల్లు క‌ట్ట‌లేని ప‌రిస్థితి.  దుబాయ్‌లోని గ‌‌ల్ఫ్ వ‌ర్క‌ర్స్ ప్రొటెక్ష‌న్ సొసైటీ అధ్య‌క్షుడు గుండెల్లి న‌ర్సింహా.. రాజేశ్‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించాడు.  అయితే బిల్లు విష‌యాన్ని న‌ర్సింహా.. దుబాయ్ కాన్సులేట్‌లో ఉన్న సుమంత్ రెడ్డికి చేర‌వేశాడు.  

స్వామినారాయ‌ణ్ ట్ర‌స్ట్‌కు చెందిన హ‌ర్జిత్ సింగ్‌.. దుబాయ్ కాన్సులేట్‌కు లేఖ రాశారు.  మాన‌వ‌తా కోణంలో బిల్లును మాఫీ చేయాల‌ని ఆయ‌న దుబాయ్ హాస్పిట‌ల్ యాజ‌మాన్యాన్ని కూడా కోరారు. అయితే ఆ లేఖ ప‌ట్ల దుబాయ్ హాస్పిట‌ల్ పాజిటివ్‌గా స్పందించింది.. బిల్లును మాఫీ చేసింది.  మ‌రో కార్మిక నేత అశోక్‌.. రాజేశ్‌కు విమాన టికెట్ ఇప్పించాడు.  ఎయిర్ ఇండియా విమానంలో బుధ‌వారం హైద‌రాబాద్ చేరుకున్న రాజేశ్‌.. 14 రోజుల హోమ్ క్వారెంటైన్‌కు వెళ్లారు.  logo