శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 08:23:47

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తొలి కేసు

 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తొలి కేసు

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ విధించాక మొదటిసారిగా పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత మంగళవారం తొలి కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులు అమలులోకి రావడంతో డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడంతో ట్రాఫిక్‌ విభాగం అధికారులు మంగళవారం నుంచి నిఘా ముమ్మరం చేశారు. కోఠి వైపు నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్‌ ఆటో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆటోడ్రైవర్‌కు డ్రంక్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. దీంతో సమీపంలోని సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ వద్ద ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా..అతడు మద్యం తాగినట్లు తేలింది. దీంతో ఆటోను స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 


logo