మంగళవారం 14 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 13:10:15

వైన్స్‌ ఎదుట మందుబాబుల బారులు

వైన్స్‌ ఎదుట మందుబాబుల బారులు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుండడంతో మందుబాబులు వైన్స్‌ దుకాణాల ఎదుట బారులుతీరుతున్నారు. భౌతిక దూరం మరిచి మందు కోసం ఎగబడుతున్నారు. మొదట్లో లాక్‌డౌన్‌ విధించినప్పుడు మద్యం లేక చాలా మంది మానసికంగా ఇబ్బందులు పడి ఎర్రగడ్డ దవాఖానలో సైతం చేరిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈసారి లాక్‌డౌన్‌ విధిస్తే అలాంటి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో ముందే మద్యం కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకోవాలని మందుబాబులు వైన్స్‌ ఎదుట క్యూ కడుతున్నారు. 

గత కన్ని వారాలతో పోలిస్తే ఈ రెండు రోజుల నుంచి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయని వైన్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగదారుల డిమాండ్‌ మేరకు ఎక్కువ మొత్తంలో స్టాక్‌ తెస్తున్నట్లు తెలిపారు. పస్తుతం రాష్ట్రంలో రాత్రి 8 గంటలకు మద్యం దుకాణాలు మూసివేస్తుండగా లాక్‌డౌన్‌ విధిస్తే పూర్తిగా మూతబడనున్నాయి. ప్రభుత్వం మొదటిసారి లాక్‌డౌన్‌ విధించినప్పుడు మార్చి 25న మద్యం దుకాణాలు మూతబడి మే6న తెరుచుకున్నాయి. 


logo