శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 13:09:15

నాలుగుసార్లు ప్లాస్మా దానం చేసిన డ్రైవర్‌ రాజు

నాలుగుసార్లు ప్లాస్మా దానం చేసిన డ్రైవర్‌ రాజు

మంచిర్యాల : ప్రాణం విలువ తెలిసినప్పటికీ కోవిడ్‌-19 నుంచి కోలుకున్న కొందరు ప్లాస్మా ఇచ్చేందుకు వెనకగు వేస్తుంటారు. కానీ కొందరుంటారు. అడిగిందే తడవుగా తక్షణం స్పందించి ఆదుకునేందుకు ముందుకువస్తారు. అటువంటి వ్యక్తే రంగం రాజు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మల్కపల్లి నివాసి. జీవనోపాది నిమిత్తం హైదరాబాద్‌లో ఓ స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోవిడ్‌ భారిన రాజు జులై 8వ తేదీన కోలుకున్నాడు. డిశ్చార్జ్‌ అనంతరం 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ప్లాస్మా ఇచ్చేవారు లేక కోవిడ్‌-19 రోగులు కొందరు ప్రాణాలొదలడాన్ని రాజు ప్రత్యక్షంగా చూసి చలించిపోయాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు డిశ్చార్జ్‌ అయ్యక ప్లాస్మా దానం చేయాలని.

ఇప్పటి వరకు కోవిడ్‌తో పోరాడుతున్న నలుగురు వ్యక్తులకు రాజు ప్లాస్మా దానం చేశాడు. ఇటీవలే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా రాజు అతనికి ప్లాస్మా దానం చేశాడు. సైబరాబాద్‌ కమిషనర్‌ వీకే సజ్జనార్‌ చేపట్టిన ప్లాస్మా దానం ప్రచారంలో రాజు పాలుపంచుకున్నాడు. బాధితులు కోలుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఎవరికైనా కోవిడ్‌ రోగులకు ప్లాస్మా కావాల్సివస్తే తన నెంబర్‌ 9866770947 లేదా తన తండ్రి నెంబర్‌ 9550966405కు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని పేర్కొన్నాడు.


logo