గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 16:08:56

ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి : జలమండలి ఎండీ

ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి : జలమండలి ఎండీ

హైదరాబాద్‌ : ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని జలమండలి ఎండీ దాన కిశోర్‌ సూచించారు.  ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. పునరావాస ప్రాంతాల్లో  నీటి ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు అందించాలన్నారు.  భారీ వర్షాల నేపథ్యంలో పైపులైన్లు లీకై తాగునీరు కాలుషితమయ్యే అవకాశముందని, ప్రజలు కాచీచల్లార్చిన నీటిని తాగితే మంచిదని చెప్పారు. బ్లీచింగ్‌ కలుపుకొని నీటిని వాడుకోవాలని కోవాలన్నారు. 

అనంతరం ఆయన జలమండలి డైరెక్టర్లు, సీజీఎంలు, జనరల్‌ మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  సీవరేజ్‌ ఫిర్యాదుల పరిష్కారానికి రూ. 1.20 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రిజర్వాయర్ల శుద్ధి మరమ్మతుల కోసం మరో రూ. 50 లక్షలు మంజూరు చేశామన్నారు.  అత్యవసర సేవల కోసం అదనంగా మరో 700 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo