మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 15:04:46

విపత్తుల సమయాల్లో బాధితులకు అండగా డీఆర్‌ఎఫ్

విపత్తుల సమయాల్లో బాధితులకు అండగా డీఆర్‌ఎఫ్

ఖమ్మం : విపత్తు సమయాల్లో బాధితుల వద్దకు రెస్క్యూ టీమ్ సత్వరమే చేరుకునే ఉద్దేశంతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) వాహనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రూ.19 లక్షలతో సమకూర్చిన రెండు డీఆర్‌ఎఫ్ వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ పాపాలాత్‌తో కలిసి ఆయన జెండా ఊపి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 

నగరంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయాల్లో ప్రజలకు మరింత మెరుగ్గా సాయం అందించడానికి ఈ డీఆర్‌ఎఫ్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు అతి వేగంగా సేవలు అందించాలని సూచించారు.  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 


విపత్తు సమయాల్లో ప్రజలకు సాయం అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ట్రైనీ ఐఏఎస్‌ వరుణ్ రెడ్డ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మున్సిపల్ సిబ్బంది, కార్పొరేటర్లు ఉన్నారు.