సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 07:52:14

శ్రీశైలం ప్లాంట్‌లో నీళ్ల తొలగింపు

శ్రీశైలం ప్లాంట్‌లో నీళ్ల తొలగింపు

  • 1,2 యూనిట్లు సేఫ్‌.. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం

అచ్చంపేట/శ్రీశైలం: శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌లో శుక్రవారం 1, 2వ యూనిట్లను అధికారులు పరీక్షించారు. రెండు యూనిట్లు సేఫ్‌గా ఉన్నాయి. వీటిలో విద్యుదుత్పత్తికి మరో పది రోజుల సమయం పట్టనున్నది. 4వ యూనిట్‌ దగ్ధం కాగా.. 6వ యూనిట్‌లో ప్యానెల్‌ కాలిపోయింది. మిగిలిన 3, 5, 6వ యూనిట్లను అధికారులు శనివారం పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్లాంట్‌లోకి వచ్చిన నీటిని మోటర్లు పెట్టి బయటికి పంపడం పూర్తయ్యింది. ప్లాంట్‌లోపల పనులు చేసేందుకు, బాట కోసం లైట్లు అమర్చి వెలిగించారు. 30 మందితో క్లీనింగ్‌ పనులు చేపడుతున్నారు. ప్రమాదంపై సీఐడీ బృందం విచారణ ముమ్మరం చేసింది. అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులుతో పాటు డీఎస్పీలు, సీఐలు ఉన్నారు. 

అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో శుక్రవారం విచారణ జరిపారు. ప్రమాద జసమయంలో విధుల్లో ఉన్న అధికారులు 17 మందిని వేర్వేరుగా ప్రత్యేక గదిలో విచారించారు. ఎక్కడి నుంచి మంటలు, పొగలు వ్యాపించాయి..బయటకు తప్పించుకొని ఎలా వచ్చారనే అంశాలపై ఒక్కొక్కరిని 15 నిమిషాలపాటు ప్రశ్నించారు. పవర్‌ ప్లాంట్‌తోపాటు ఉద్యోగులు, అధికారులు, బయటివారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ప్రమాదంపై స్థానికంగా ఏమనుకుంటున్నారు..? ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..? అనే విషయమై ప్రజల నుంచి తెలుసుకుంటున్నారు. 

తాజావార్తలు


logo