ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 01:20:15

గడపదాటితే డేంజర్‌

గడపదాటితే డేంజర్‌

  • ఇల్లు కదలాలంటే ఐదుసాైర్లెనా ఆలోచించండి
  • ప్రజలకు డాక్టర్‌ రామ్‌కిరణ్‌ సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరైతేనే గడపదాటాలని ఐఎంఏ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ రామ్‌కిరణ్‌ అన్నారు. వాతావరణంలో మార్పు వల్ల వైరస్‌ మరింత  వ్యాప్తిచెందే ప్రమాదమున్నదని హె చ్చరించారు. ఇల్లు కదలాలంటే ప్రతి ఒక్కరూ ఒకటికి ఐదుసాైర్లెనా ఆలోచించాలన్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే అన్ని  జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

 వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం ప్రజలందరి సామాజిక బాధ్యత అని, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని సూచిం చారు. ప్రజలు గుంపులుగా ఉన్నచోట వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున సభలు, సమావేశాలు, పెండ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉంటే శరీరంలో వైరస్‌ను తట్టుకొనే ఇమ్యునిటీ పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. 


logo