శనివారం 11 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 00:39:35

కళాకారులకు ఆర్థికచేయూత

కళాకారులకు ఆర్థికచేయూత

  • రెండువేల చొప్పున అందజేసిన డాక్టర్‌ కేవీ రమణాచారి

తెలుగుయూనివర్సిటీ: యువ కళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ కార్యాలయంలో వంద మంది తెలంగాణ జానపద కళాకారులకు నగదు పురస్కారాలను ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి శుక్రవారం అందజేశారు.  ఏప్రిల్‌లో కూడా ప్రతి కళాకారుడికి రూ.1000 చొప్పున 100 మందికి ఆర్థికసాయం అందించినట్టు ఫౌండేషన్‌ చైర్మన్‌ సారిపల్లి కొండలరావు తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు వంగా శ్రీనివాస్‌గౌడ్‌, యువకళావాహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వరరావు, కార్యవర్గసభ్యులు మల్లికార్జున్‌, హమీద్‌ పాల్గొన్నారు.logo