గురువారం 28 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 02:17:45

బయోమెడికల్‌ రిసెర్చ్‌ పరీక్షలోతెలంగాణ టాపర్‌గా డాక్టర్‌ జలగం

బయోమెడికల్‌ రిసెర్చ్‌ పరీక్షలోతెలంగాణ టాపర్‌గా డాక్టర్‌ జలగం

ఖలీల్‌వాడి, జనవరి 9: ఆలిండియా బయో మెడికల్‌ రిసెర్చ్‌ పరీక్షలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌ జలగం తిరుపతిరావు అత్యుత్తమ ప్రతిభ చాటారు. జాతీయస్థాయిలో పదో ర్యాంకు సాధించి తెలంగాణ టాపర్‌గా నిలిచారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు వైద్య విద్యాబోధన చేసే అధ్యాపకులకు ఈ పరీక్షను తప్పనిసరి చేశారు. ఈ పరీక్షలో 93 శాతం మార్కులతో తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని డాక్టర్‌ జలగం తిరుపతి రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.logo