సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 19:56:07

వృద్ధాశ్రమానికి డా.ఆనంద్ మిత్ర బృందం చేయూత

వృద్ధాశ్రమానికి డా.ఆనంద్ మిత్ర బృందం చేయూత

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ఈసీఐఎల్ లో ఉన్న భరతమాత వృద్ధాశ్రమానికి డా. ఆనంద్ మిత్ర బృందం సోమ‌వారం నిత్యావసర వస్తువులను అంద‌జేసింది. ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ తన మిత్రుల సహకారంతో బంజారా మహిళా ఎన్జీవో ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు పదిహేను రాష్ట్రాల్లో సహాయక శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డా.ఆనంద్, కృష్ణ వంగీపురం, కిరణ్ బద్దంల సహాయ సహాకారాలతో నేడు వృద్ధాశ్ర‌మంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేశారు. logo