శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 14:05:47

భూ త‌గాదాలో డోజ‌ర్‌ను త‌గుల‌బెట్టిన వైనం

భూ త‌గాదాలో డోజ‌ర్‌ను త‌గుల‌బెట్టిన వైనం

రంగారెడ్డి : భూ త‌గాదాలో డోజ‌ర్ వాహ‌నాన్ని పెట్రోల్ పోసి త‌గులబెట్టారు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. భూమి నాదంటే నాది అంటూ గత కొంతకాలంగా తగాదాలు న‌డుస్తున్నాయి. తగాదాలో ఉన్న భూమిని దున్నుతున్న సమయంలో మ‌రో వర్గానికి చెందిన‌ ముగ్గురు వ్యక్తులు వచ్చి డ్రైవర్‌ను బెదిరించి పెట్రోలు పోసి డోజర్ బండిని తగలబెట్టారు. 14 ఎకరాల 15 గుంటలు గల భూమి కోసం ఇరువ‌ర్గాల మ‌ధ్య కోర్టులో కేసు న‌డుస్తుంది. కాగా తగాదాలో ఉన్న భూమిని నేడు దున్నతున్న సమయంలో మరో వర్గం వారు వచ్చి వాహ‌నాన్ని తగలబెట్టారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేప‌ట్టారు.


logo