మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 18:27:28

పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ‘డబుల్’ ఇండ్లు

పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ‘డబుల్’ ఇండ్లు

మహబూబ్‌నగర్ : పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిలుస్తాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ బెడ్‌రూం ఇండ్లను జెడ్పీ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి లక్కీ డిప్ ద్వారా అందజేశారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇండ్లు లేని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తున్నామన్నారు.

పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. పేదలకు అండగా ఉండటంలో టీర్ఎస్ సర్కారు ముందంజలో ఉంటుందన్నారు. వెనకబడిన పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుని వలసల జిల్లా అని పడిన ముద్రను చెరిపేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మహబూబ్ నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

విహారంలో విషాదం..ముగ్గురి దుర్మణం 

వ్యవసాయ బావిలో చిరుతపులి..

సాగు చ‌ట్టాల కాపీల‌ను త‌గులబెట్టిన రైతులు

తుపాకీ కాల్పుల్లో ఇండిగో మేనేజర్‌ మృతి 

పిచ్చిగా మాట్లాడొద్దు.. ప్రజలని రెచ్చగొట్టొద్దు 


logo