బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:24:53

ఫాస్టాగ్‌ లేన్‌లోకి వస్తే వడ్డనే!

ఫాస్టాగ్‌ లేన్‌లోకి వస్తే వడ్డనే!
  • స్టిక్కర్‌ లేకుండా వస్తే రెట్టింపు రుసుం
  • చర్యలకు హెచ్‌జీసీఎల్‌ సిద్ధం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై నిబంధనలను అతిక్రమించే వాహనదారుల నుంచి రెట్టింపు రుసుం వసూలుచేయాలని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌/ఔటర్‌ విభా గం) అధికారులు నిర్ణయించారు. ఇకనుంచి కచ్చితంగా నిర్దేశించిన (డెడికేటెడ్‌) లేన్‌లోనే వాహనదారుడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఔటర్‌పై నిత్యం 1.25 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తు న్నాయి. ఇందులో 50 శాతానికిపైగా ఫాస్టాగ్‌తోనే ప్రయాణిస్తున్నాయి. 


ఫాస్టాగ్‌ లేన్‌లోకి మాన్యువల్‌గా నగదు చెల్లిస్తామంటూ వస్తున్న వాహనదారుల సంఖ్య ఇటీవల  పెరిగింది. నిర్దేశించిన లేన్‌లోనే వాహనదారులు ప్రయాణించాలని, లేదంటే రెట్టింపు చార్జీలు వసూలుచేస్తామని ఔటర్‌ విభాగం అధికారులు టోల్‌గేట్‌ కేంద్రాల వద్ద హెచ్చరిక నోటీసులు అంటించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ఫాస్టాగ్‌ లేన్‌లోకి వచ్చే ఇతరులు కచ్చితంగా అధికరుసుం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిరిస్తున్నారు. ఈ అంశంపై ఒకటి, రెండురోజుల్లో మరింత స్పష్టత ఇవ్వనున్నారు.


logo
>>>>>>