సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 12:55:15

సకల సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

సకల సౌకర్యాలతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

సిద్దిపేట : దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దింటి గృహాలకు దీటుగా పేదల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహ ప్రవేశాలు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో పండుగ వాతావరణంలో 216 మంది లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదారాబాద్ గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్ల భారీ గృహ సముదాయాలు నిర్మించామన్నారు.

నయా పైసా ఖర్చు లేకుండా.. పేదలకు నూతన వస్త్రాలు బహూకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నామన్నారు. లబ్ధిదారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను సద్వినియోగం చేసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కట్టిన ఇళ్లు..పెట్టిన పొయ్యి..కొత్త బట్టలు పెట్టి కొత్తిoడ్లకు తోలిస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కిరాయికి ఇచ్చినా, విక్రయించినా బాధ్యులపై చర్యలతో పాటు ఇండ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.logo