ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 13:57:36

గడువులోగా డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలి

గడువులోగా డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేయాలి

వరంగల్ అర్బన్ : జిల్లాలోని దూపకుంటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ దూపకుంటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను  అర్ అండ్ బీ, ఎస్ఈ నాగేందర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ కనీసం 400 గృహాలైనా దసరా వరకు పనులను పూర్తి చేయాలన్నారు. 

మిగతా ఇండ్లను యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని ఆదేశించారు. 1000 గృహాలు స్లాబ్ పూర్తయిన నేపథ్యంలో వాటిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయలన్నారు.  ఇండ్లు పూర్తయ్యేందుకు వారం వారం ఎంత ప్రగతి సాధిస్తారో ఏజెన్సీ నుంచి  పూర్తి వివరాలు తీసుకోవాలనీ అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ వెంట అర్ అండ్ బీ ఈఈ రాజం, డిప్యూటీ ఈఈ, జిల్లా నోడల్ అధికారి రాజేందర్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు


logo