బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:31:59

పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ‘డబుల్‌' ఇండ్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ‘డబుల్‌' ఇండ్లు  ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌: నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నది సీఎం కేసీఆర్‌ ఆశయం.. అందుకోసమే ఇండ్లులేనివారికి రూపాయి ఖర్చులేకుండా డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లి ఎస్సీ కాలనీలో 16, గంగిరెద్దుల కాలనీలో 20 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. నిరుపేదలైన సంచార జాతులకు చెందిన పిట్టలోల్లు, గంగిరెద్దులోల్లు, హోళియ దాసరులు ఇలా అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామన్నారు. అగ్ర వర్ణాల్లోని నిరుపేదలకూ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనాన్ని సిద్దిపేటలో ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం అన్ని మతాల వారిని సముచితంగా చూస్తూ గౌరవిస్తుందన్నారు.  


logo