మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 14:54:23

పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

భద్రాద్రి కొత్తగూడెం : పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రభుత్వం అందజేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

జిల్లాలోని జులురుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.5.03 కోట్లతో 80 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దుబ్బతండా గ్రామంలో రూ.2.26 కోట్లతో 45 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రామచంద్రపురంలో రూ.3.27 కోట్లతో 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎలకలఒడ్డు గ్రామంలో రూ.1.76కోట్లుతో 35 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మొత్తం రూ. 12.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 225 ఇండ్లను ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. అందుకే భారీ వ్యయంతో కూడుకున్నప్పటికి రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా చేపట్టామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 500కు పైగా డబుల్ బెండ్ రూమ్ ఇండ్లను నిరుపేదలకు అందజేశామన్నారు. 

నిర్మాణంలో ఉన్న మిగతా గ్రామాల్లో ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


logo